గ్రీకు సుందరి జీవితం తలకిందులు

0

ఎల్లీ అవ్ రామ్.. ఇండియన్ స్క్రీన్ పై గ్రీకు సుందరిగా పాపులర్. `పరదేశి` డ్యాన్స్ గ్రూప్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వీడన్కు చెందిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 7తో లైమ్ లైట్ లోకి వచ్చింది. వస్తూనే బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ నాటి సీజన్ కే తనదైన స్టైల్ డ్యాన్సులతో మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఆ తరువాత `మిక్కీ వైరస్` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంలోని ఐటమ్ సాంగ్ లో మెరిసి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇండియన్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యాలో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఈ స్వీడన్ సుందరి ఉన్నట్టుండి అతగాడు షాకివ్వడంతో బిత్తరపోయింది. తనని కాదని హార్థిక్ పాండ్యా నటాషాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఇటీవల ఓ కిడ్ కూడా జన్మించాడు.

పాండ్యా ఇచ్చిన ఒకే ఒక్క ఝలక్ ని ఎల్లీ అస్సలు జీర్ణించుకోలేకపోతోందట. లైఫ్ జర్నీ ఎక్కడో వుండాల్సిన ఎల్లీ అవ్రమ్ లైఫ్ ఒక్కసారిగా ఊహించనిది ఎదురు కావడంతో అంతా తల్లకిందులైపోయింది. “ప్రపంచం ప్రస్తుతం నాకు తలకిందులుగా కనిపిస్తోంది. మీకు ఇలాగే వుందా?“ అంటూ అమ్మడు నిర్వేదం ప్రదర్శిస్తూ తలకిందులుగా వున్న తన ఫొటోని షేర్ చేసింది. అవును ఇలాంటి అనుభవం ఎదురైతే ఎవరి జీవితమైనా తలకిందులేగా.. అంటూ బోయ్స్ ఒకటే కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.