Templates by BIGtheme NET
Home >> Cinema News >> యువహీరోతో డేటింగ్ ని ఖండించిన రకుల్

యువహీరోతో డేటింగ్ ని ఖండించిన రకుల్


కెరీర్ పరంగా మరో రెండేళ్ల పాటు డోఖా లేనన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల రేస్ లో వెనకబడుతోందన్న కథనాల నడుమ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సంతకాలు చేసి రయ్ మని దూసుకొచ్చింది. తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ఇదే రకంగా సమాధానమిస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో రకుల్ రకరకాల విషయాలపై మనసు విప్పి మాట్లాడింది. రకుల్ ఇప్పటికి ఆరు చిత్రాలతో బిజీగా ఉన్నానని చెప్పింది. రాబోయే రెండేళ్ళ వరకు బిజీగా ఉన్నానని అంది. ప్రముఖ యువహీరోతో డేటింగ్ వ్యవహారంపైనా ఓపెనైంది.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. తాను ప్రస్తుతానికి ఒంటరిగా ఉన్నానని తెలిపింది. కానీ ఏదో ఒకరోజు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమేనని దానిని ఇష్టపడతానని తెలిపింది. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ .. ప్రేమ వివాహం అంటే ఇష్టమే. కానీ ప్రస్తుతానికి నేను ఒంటరిగా ఉన్నాను. కెరీర్ తో మాత్రమే ప్రేమలో ఉన్నాను. దానివల్ల బిజీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్.