రకుల్ చాలా కాలం తర్వాత

టాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమద్య రెగ్యులర్ గా ఫొటోలు మరియు వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండేది. కాని ఆమద్య వేరే విషయాల వల్ల దురదృష్టవశాత్తు మీడియాలో ప్రచారం అవ్వాల్సి వచ్చింది. ఆ వ్యవహారం నుండి మెల్లగా బయట పడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు జోడీగా రకుల్ ఆ సినిమాలో నటించిన విషయం తెల్సిందే భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమా అటవి బ్యాక్ గ్రౌండ్ లో కొనసాగుతుందట.

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ ట్రెండ్ అవుతున్న ఈ అమ్మడు ఇప్పుడు వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. వెయిట్ లిఫ్ట్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఈ అమ్మడు చాలా కాలం తర్వాత అంటూ కామెంట్ పెట్టింది. కరోనా లాక్ డౌన్ ఇతరత్ర కారణాల వల్ల ఈమె జిమ్ లో ఎక్కువగా గడపటం లేదని తెలుస్తోంది. అందుకే చాలా కాలం తర్వాత వెయిట్ లిఫ్టింగ్ అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. ఫిట్ నెస్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు చూపించే హీరోయిన్ ల జాబితాలో రకుల్ ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Related Images: