కలవరపడుతున్న రకుల్ ఫ్యాన్స్…!

0

డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉందని నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన నటి రియా చక్రవర్తి పలువురు సెలబ్రిటీల పేర్లు వెల్లడించిందని.. అందులో రకుల్ – సారా అలీఖాన్ పేర్లు కూడా ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్ట్ రకుల్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో రకుల్ తిరిగి హైదరాబాద్ కు వచ్చి.. ప్రస్తుతం తాను నటిస్తున్న క్రిష్ – వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొంటోంది.

అయితే తాజాగా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ పేరు జాతీయ మీడియా ఛానల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీపికా పదుకొణె – రకుల్ ప్రీత్ సింగ్ – సారా అలీఖాన్ – శ్రద్ధా కపూర్ లకు సమన్లు జారీ చేసినట్లు ఇండియా టుడేతో పాటు పలు నేషనల్ మీడియా ఛానల్స్ లో కథనాలు ప్రసారం అవుతున్నాయి. మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్సీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారనేది ఈ వార్తల సారాంశం. మరోసారి డ్రగ్స్ కేసులో రకుల్ పేరు చర్చనీయాంశంగా మారడంతో ఆమె ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలతో సారీ రకుల్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన ఆమె ఫ్యాన్స్.. ఇప్పుడు ఏకంగా రకుల్ కు ఎన్సీబీ సమన్లు జారీ చేసిందనే న్యూస్ విని ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది.