మెగా హీరో మూవీ అఫిషియల్ అనౌన్స్ మెంట్

0

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సమ్మర్ లోనే విడుదల చేయాలనుకున్న ఆ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఆ సినిమా షూటింగ్ ను రెండు మూడు వారాల్లో పూర్తి చేసి తదుపరి సినిమాకు సాయి ధరమ్ తేజ్ వెళ్లబోతున్నాడు. కొన్ని నెలల క్రితం దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ఈయన సినిమా ప్రకటన వచ్చింది. అయితే ఇటీవల సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాను తేజూ అధికారికంగా ప్రకటించాడు. దాంతో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. కాని దర్శకుడు దేవా కట్టా వచ్చే నెలలో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

సాయి ధరమ్ తేజ్ 14వ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యిందంటూ దేవా కట్టా ట్వీట్ చేశాడు. తన టీంతో దేవా కట్టా తీసుకున్న ఫొటోను షేర్ చేసి వచ్చే నెలలో షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం తేజూ చేస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటే దేవా కట్టా దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో సరికొత్త పాత్రను చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తేజూ మూవీ ఉండే అవకాశం ఉంది.