ఆర్జీవీ వోడ్కా అంటే పూరి వైన్ అంటాడేంటి?

0

వెర్సటైల్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్తగా యాపిల్ పోడ్ కాస్ట్ తో పాటు స్పోటిఫై యాప్ లో `పూరి మ్యూజింగ్స్` పేరుతో తనకు నచ్చిన విషయాల్ని బాహాటంగా చెప్పేస్తున్నారు. నచ్చింది చేసేయడమే ఫిలాసఫీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు పూరి. తాజాగా ఆయన మరో ఆడియోని వదిలారు. వైన్ తాగడం ఒక ఆర్ట్ .. కొన్ని దేశాల్లో ఫుడ్ తిని.. వైన్ తాగి చనిపోవచ్చని చెప్పి షాకిచ్చారు.

ఇదేంటీ పబ్లిక్ గా మందు తాగండి అంటున్నారేంటని అంతా అవాక్కవుతున్నారు. వైన్ పై పెద్ద లెక్చరే దంచేశారు పూరీ. `వైన్ అంటే ఫార్మెంటెడ్ గ్రేప్ జ్యూస్..7000 సంవత్సరాల క్రితం చైనాలో మొట్టమొదటి సారి దీన్ని తయారు చేశారు. ఆ తరువాత జార్జియా.. ఇరాన్ .. సిసిలీలో నిదానంగా మొదలైంది. అయితే ఈ వైన్ ఒక్కో గ్రేప్ ని బట్టి ఒక్కో టేస్ట్ వుంటుందట. అలాగే ఆ గ్రేప్ ఎక్కడ పెరిగింది? దాని వెదర్.. సన్ లైట్ వాటర్ ని బట్టి కూడా రకరకాల టేస్ట్లు వస్తాయని చెప్పారు పూరి.

క్యాబనీస్ సోరియాన్.. మెర్లో.. టెంపరానిలో.. గామె.. చిరా.. పిను నోయర్ ఇలా ఎన్నో పేర్లున్నాయి. అందరికీ రెడ్ వైన్.. వైట్ వైన్.. రోజ్ వైన్ మాత్రమే తెలుసు. అయితే వైట్ వైన్ కి గ్యాస్ ఫిల్ చేస్తే దాన్ని స్పార్కింగ్ వైన్ అంటారు. ఇక ఫ్రాన్స్లో షాంపెయిన్ అని ఒక రిజియన్ వుంది. పోర్చుగల్ వైన్ ని పోర్ట్ వైన్ అంటారు. అలాగే గ్రీన్ వైన్ దొరుకుతుంది. దీన్ని పోర్చుగల్ లో మాత్రమే తయారు చేస్తారు. గోస్ మలిస్కో అనే సీ ఫుడ్ తింటూ గ్రీన్ వైన్ తాగుతారు. అద్భుతంగా వుంటుంది. దీన్ని టేస్ట్ చేయడానికి టేస్టర్స్ వుంటారు. వీరిని సోమాలియే అంటారు. వీరు ఫైవ్ స్టార్ హోటల్స్ లో వుంటారు. రంగు రుచి వాసన అన్నీ చెప్పేస్తారు. ఇలాంటి ఉద్యోగం మీరు చేయాలంటే వైన్ టెస్టింగ్ కోర్స్ చేయొచ్చు. ఆ కోర్స్ కాస్ట్ పదివేల డాలర్లు అని వైన్ పురాణం చెప్పారు పూరి. అయితే గురువు ఆర్జీవీ వోడ్కా తాగి చనిపోవాలంటే.. పూరి ఏంటి వైన్ తాగి చనిపోతానన్నాడు!