డ్రగ్ కేసులో దీపికా – రకుల్ – శ్రద్ధా కపూర్ – సారా లకు NCB సమన్లు…?

0

సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో అనేక మంది స్టార్ హీరోయిన్ లకు లింకులు ఉన్నాయని గత కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్టుగా నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె – రకుల్ ప్రీత్ సింగ్ – సారా అలీఖాన్ – శ్రద్ధా కపూర్ ల పేర్లు ప్రధానంగా ఉన్నట్లు గత రెండు రోజులుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీపికా పదుకొణె – రకుల్ ప్రీత్ సింగ్ – సారా అలీఖాన్ – శ్రద్ధా కపూర్ లకు సమన్లు జారీ చేసినట్లు నేషనల్ మీడియా ఛానల్ ఇండియా టుడే కథనాలు ప్రసారం చేస్తోంది. దీపికా పడుకునే తన మేనేజర్ తో డ్రగ్ వ్యవహారం గురించి వాట్సాప్ చాటింగ్ ద్వారా సంభాషించినట్లు సదరు ఛానల్ పేర్కొంది. వీరితో పాటు ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా కరిష్మా ప్రకాష్ మరియు సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ శ్రుతి మోడీలను కూడా ఎన్సీబీ అధికారుల విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వీరందరిని రాబోయే మూడు రోజుల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించనున్నట్లు ఇండియా టుడే వెల్లడించింది.