Templates by BIGtheme NET
Home >> Cinema News >> మాల్దీవుల విహారం.. రకుల్ చిలౌట్ జ్ఞాపకాలు

మాల్దీవుల విహారం.. రకుల్ చిలౌట్ జ్ఞాపకాలు


అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి ఈసారి బీచ్ సెలబ్రేషన్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో నిరంతర అప్ డేట్స్ తో చాలా యాక్టివ్గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే మాల్దీవుల చిలౌట్ కి సంబంధించిన రకరకాల ఫోటోల్ని షేర్ చేశారు. నిన్నటితో విహారయాత్రను ముగించి ముంబైకి తిరిగి పయనమయ్యిందట. లేటెస్టుగా రకుల్ సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన ఫోటోలు వీడియోలను పంచుకుంది.

ఈ రోజు తన సోదరుడు అమన్ ఇన్స్టాగ్రామ్ లో ఓ అరుదైన కుటుంబ చిత్రాన్ని పంచుకున్నారు. అక్కడ ఫ్యామిలీ అంతా తెలుపు రంగు దుస్తుల్లో కనిపించారు. రకుల్ వైట్ ఫ్రంట్ నాట్ క్రాప్ టాప్ ను తెల్లని బాటమ్ డ్రెస్ తో కనిపించింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా వైట్ క్యాజువల్స్ ధరించారు. తన అభిమానులతో చిత్రాన్ని పంచుకుంటూ అమన్ ఇలా వ్రాశాడు “హమ్ సాథ్ సాత్ హైన్ ” ఇక్కడ చూడండి అంటూ వ్యాఖ్యానించగా ఆ ఫోటో ఇప్పటికే వైరల్ అయ్యింది. “అందమైన కుటుంబం” అంటూ కామెంట్లు వేడెక్కాయి.

రకుల్ తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగానే ఇలా మాల్దీవుల విహారాన్ని ప్లాన్ చేశారట. “జీవితం ఎక్కడ మొదలవుతుంది… ప్రేమ అంతం కాదు !! ఇకపై వర్క్మోడ్ ” అంటూ రకుల్ వ్యాఖ్యానించింది. అలాగే రకుల్ ఓ అందమైన నెస్ట్ తరహా ఊయలలో కూచుని కూల్ గా చిల్ చేస్తున్న ఫోటోని షేర్ చేయగా అది క్షణాల్లోనే అంతర్జాలంలో వైరల్ అయిపోయింది.

రకుల్ కెరీర్ సంగతి చూస్తే… అజయ్ దేవ్గన్ – అమితాబ్ బచ్చన్ లతో కలిసి ‘మేడే’ చిత్రంలో కనిపించనుంది. ఇందులో రకుల్ కో-పైలట్ పాత్రను పోషించనుంది. ఆమె అర్జున్ కపూర్తో ఒక చిత్రం చేస్తోంది. భారతీయుడు 2లోనూ ఒక నాయికగా నటిస్తోంది. శివకార్తికేయన్ తో కలిసి ఆలయన్ లో నటిస్తోంది. ఈ మూవీ చివరి షెడ్యూల్ పూర్తవుతోంది.