రకుల్ అప్పటి ఫొటోలు ఇప్పుడు వైరల్

0

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ బికినీ ఫొటోలు రీసెంట్ వి కాదు. ఆమె మోడల్ గా చేసిన టైంలో తీసుకున్న ఫొటో షూట్ స్టిల్స్. హీరోయిన్ గా పరిచయం కాకముందు రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ చేసింది. ఆ సమయంలో బికినీలో ఫొటో షూట్ ఇచ్చింది. కాలేజ్ డేస్ లో ఆమె ఇచ్చిన బికినీ ఫొటో షూట్ స్టిల్స్ ఇప్పుడు ఎలా బయటకు వచ్చాయో కాని నెట్టింట ఎక్కడ చూసినా కూడా అవే కనిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ ఫేస్ బుక్ అన్ని చోట్ల కూడా రకుల్ బికినీ స్టిల్స్ ఉన్నాయి.

మోడలింగ్ లో కొన్నాళ్లు కొనసాగిన తర్వాత అనూహ్యంగా సినిమాల్లో ఆఫర్ వచ్చింది. ఈమె సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె సినీ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. అయినా కూడా మళ్లీ పుంజుకుంటాను అనే నమ్మకంతో వచ్చిన ఆఫర్లను వదిలి పెట్టకుండా చేస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో కూడా నటించేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ గా రకుల్ హాట్ ఫొటో షూట్స్ సోషల్ మీడియా ద్వారా వస్తూనే ఉంటాయి. మళ్లీ ప్రత్యేకంగా అప్పటి ఫొటోలను ఇప్పుడు వైరల్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందబ్బా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.