హైదరాబాద్ వచ్చేసిన రకుల్.. డ్రగ్స్ కథ ముగిసినట్టేనా?

0

తెలుగు తెరమీద కొంత కాలం పాటు స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడింది. ఆమె స్నేహితురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో రకుల్కు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యం లో నెల రోజుల పాటు రకుల్ ముంబైలోనే ఉండిపోయింది. గత నెల 25న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఎదుట హాజరైంది. డ్రగ్స్ కేసు రాకముందే ఆమె పలు సినిమాలకు ఒప్పుకున్నది. ఇందులో భాగంగా వైష్టవ్ తేజ్తో ఓ సినిమాను చేస్తోంది. ఈ చిత్రం వికారాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ లో ఉండగానే ఆమెకు డ్రగ్స్ కేసులో నోటీసులు అందడం తో ముంబై వెళ్లి పోయింది.

అయితే సోమవారం హైదరాబాద్ చేరుకున్న రకుల్.. రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటోంది. వికారాబాద్ ఫారెస్ట్లో ఒక కీలకమైన సన్నివేశంలో రకుల్ నటించింది. ఈ షెడ్యూల్లో తన భాగాలను పూర్తి చేసిన తర్వాత ఆమె నితిన్ ‘చెక్’ లో నటించనున్నది. పూర్తయ్యే వరకు ఈ చిత్రం కోసం నాన్స్టాప్ షూట్ చేస్తుంది. ఈ రెండు చిత్రాలతో ఆమె కొంత కాలం పాటు హైదరాబాద్ లోనే బిజీగా ఉంటుంది. రకుల్ వైష్ణవ్ తేజ్ చిత్రంలో పల్లెటూరి పిల్లగా కనిపించనుండగా చంద్రశేఖర్ ఏలేటి చెక్ చిత్రంలో లాయర్ పాత్రలో నటించనుంది. డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడానికి ముందే ఈ ప్రాజెక్టులకు ఆమె సంతకం చేసింది. తెలుగులో రెండు సినిమాలు కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ లో రెండు చొప్పున సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.