చల్లటి సాయంత్రాన.. బీచ్ లో ప్రియురాలితో చాహల్

0

కొద్ది రోజులుగా యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం క్రికెటర్లు యమ బిజీగా ఉంటున్నారు. కొందరు క్రికెటర్లు మాత్రం కాస్త వీలు దొరికితే అక్కడి పర్యాటక ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. టీమిండియా స్పిన్నర్ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ ఐపీఎల్లో తీరిక లేని క్రికెట్ ఆడుతూనే మరోవైపు తనకు కాబోయే భార్యతో సరదాగా గడుపుతోన్నాడు. తాజాగా చాహల్ తనకు కాబోయే భార్య ధనశ్రీతో కలిసి చల్లటి సాయంత్రానా బీచ్లో సందడి చేశారు. సరదాగా ఫొటోలు దిగారు. దీన్ని చాహల్ ఇన్స్టాలో పోస్ట్ చేసి ‘ఇది సరైన సాయంత్రం’ అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాబోయే జంట చూడముచ్చటగా ఉందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవలే దుబాయ్ చేరుకున్న ధనశ్రీ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్కు హాజరైంది. ఆ సమయంలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మతో సహా బెంగళూరు జట్టుకు చెందిన ఆటగాళ్లతో కలిసి ఆమె ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో చాహల్ అద్భుతంగా ఆడుతున్నాడు. కీలకమైన సమయాల్లో వికెట్లు పడుతూ బెంగళూరు విషయాల్లో చక్కటి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన చాహల్ ఏకంగా 13 వికెట్లు తీశాడు. ఈసారి బెంగళూరు సాధిస్తున్న చక్కటి విజయాల్లో చాహల్ పాత్ర కూడా ఉంది.