జూనియర్ సర్జా కు బాబాయ్ అద్భుతమైన బహుమతి

0

కన్నడలో ప్రముఖ నటుడిగా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి సర్జా కొద్ది రోజుల కిందట అకస్మాత్తుగా మృతి చెంది అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచెత్తాడు. ఆయన చనిపోయే నాటికి సర్జా భార్య మేఘనా రాజ్ గర్భిణి. ఆ దంపతుల బిడ్డ త్వరలోనే ఈ లోకానికి రానుంది. కాగా ఆ బిడ్డకు ఇప్పట్నుంచే బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి సోదరుడు ధ్రువ సర్జా బిడ్డ కోసం వెండితో తయారైన ఊయలను బహుమతిగా అందజేశాడు. రూ.10 లక్షల విలువైన ఈ ఊయలకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా అవి సర్జా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సర్జా సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు. మామ లాగే సినీ రంగంలోకి వచ్చిన చిరంజీవి సర్జా కన్నడలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్టార్ గా ఎదుగుతున్న సమయంలో జూన్ 7న అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. 36 ఏళ్ల వయస్సులోనే ఆయన కన్నుమూయడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. 2018లో చిరంజీవి సర్జా కథానాయిక మేఘనా రాజ్ పెళ్లి చేసుకున్నారు. సర్జా మరణం నాటికి గర్భిణి అయిన ఆయన భార్య మేఘన సీమంతం ఇటీవల వేడుకగా జరిపారు. భర్తను మర్చిపోలేకపోతున్నా మేఘన సర్జా కటౌట్ చేయించి తన కుర్చీ వద్దే పెట్టుకుంది. సీమంతం కార్యక్రమానికి వచ్చిన అతిథులంతా సర్జా కటౌట్ చూసి ఆయనను మేఘన పక్కనే చూసి చూసినట్లుగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట అభిమానులను ఆకట్టుకున్నాయి.