కింగ్ మామని మించిన కోడలు

0

అక్కినేని వారి కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఫ్యాషన్ బ్రాండ్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. `సాకీ` పేరుతో సొంతంగా కాస్ట్యూమ్స్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది క్రేజీ హీరోయిన్ లు.. హీరోలు క్రేజీగా సొంత బ్రాండ్ లని స్టార్ట్ చేసి సరి కొత్త బిజినెస్ కి వెల్కమ్ చెప్పిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ… సోనమ్ కపూర్ అండ్ సిస్టర్స్ కూడా ఓన్ బ్రాండ్ ని మొదలుపెట్టి ఎంటర్ ప్రెన్యూర్స్ జాబితాలో చేరారు. ఇప్పుడు కోడలు సామ్ వంతు.

తెలుగు హీరోయిన్ లలో మాత్రం సమంతనే ఇప్పటికి వరకు బెస్ట్ గా నిలిచింది. బిజినెస్ మైండ్ సెట్ విషయంలో మామ నాగార్జునను మించిన కోడలుగా పేరు తెచ్చుకుంటోంది. క్రేజీ బ్రాండ్ లకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూనే తనదైన మార్కు సొంత బ్రాండ్ కి కూడా వాల్యూని తీసుకొస్తోంది. ఫ్యాషన్ రంగంలో సమంత ప్రవేశ పెట్టిన `సాకి` బ్రాండ్ మార్కెట్ లో హాట్ కేక్ గా మారింది.

ఈ బ్రాండ్ కు తనే బ్రాండ్ అంబాసిడర్ కూడా కావడంతో వారికో డిజైనర్ వేర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా సామ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటుంన్నాయి. బ్రౌన్ కలర్ కుర్తా పైజామాని సరికొత్తగా డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునే విధంగా వుంది. ఈ డ్రెస్ లో హొయలు పోతూ సామ్ ఇచ్చిన పోజులకు లవ్ లీ.. హాట్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. సంథింగ్ ఏదైనా ట్రెడిషనల్ గా అయినా మోడ్రన్ లుక్ అయినా సమంత సంథింగ్ స్పెషల్ అన్న ప్రశంసలు దక్కుతున్నాయి.