అందాల ఆరబోతకు ఓకే కానీ కండీషన్స్ అప్లయ్

0

పాయల్ కెరీర్ ఆరంభమే బోల్డ్ ఎటెంప్ట్ తో కుర్రకారుకు కంటిమీద కునుకు కరువయ్యేలా చేసిన ఈ పంజాబీ బ్యూటీ.. ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఆర్.ఎక్స్ 100 లో ఎఫైర్ క్వీన్ గా ఆకట్టుకుని ఆ వెంటనే ఆర్.డి.ఎక్స్ లో బాంబర్ లా విస్పోటనానికి కారణమైంది.

సరిగ్గా అదే పాయింట్ ఈ అమ్మడి కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది. ఇటీవల విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ ఆఫర్ తప్ప వేరొక మంచి ఆఫర్ ఏదీ ఈ అమ్మడిని వరించనే లేదు. అగ్ర హీరోల కన్ను ఎందుకనో ఈ అమ్మడి వైపు ప్రసరించడం లేదు. చిరంజీవి.. నాగార్జున.. బాలయ్య వంటి స్టార్లు ఈ భామకు అవకాశం ఇవ్వకపోవడం విస్మయం కలిగించేదే. ఇక ఇతర అగ్ర హీరోలు సైతం బాలీవుడ్ భామలకో మల్లూ భామలకో అవకాశాలిస్తున్నారు కానీ పాయల్ కి ఛాన్సివ్వడం లేదు.

అయితే ఇప్పుడున్న డైలమా నుంచి బయటపడేందుకు పాయల్ చేయని ప్రయత్నం లేదు. సోషల్ మీడియా వేదికగా నిరంతరం వేడెక్కించే స్టింట్ తో టచ్ లో ఉంది. ఇప్పటికి యూత్ లో ఉన్న క్రేజ్ ని ఎలాగైనా ఇంకా పెంచుకోవాలని ట్రై చేస్తోంది. అయితే ఈ బ్యూటీకి మాత్రం ప్రాపర్ అవకాశాలు రావడం లేదు. ఎంత సేపు అడల్ట్ కంటెంట్ తో ఉన్న ఆఫర్సే వస్తున్నాయిట. పైగా ఈ బ్యూటీ యాక్ట్ చేయాలంటే 40 లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. పెద్ద హీరోలైతే ఈ బ్యూటీ వైపు కూడా చూడటం లేదు. కనీసం రవితేజ నుంచి అయినా పలకరింపు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.