మాల్దీవుల్ని దడదడలాడిస్తున్న రకుల్

0

మాల్దీవులపై తారల దాడి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అందాల నాయికలు మాల్దీవుల వెకేషన్ లో సేద దీరి ఇళ్లకు చేరుకున్నారు. నేడు బర్త్ డే గాళ్ తారా సుతారియా మాల్దీవుల సెలబ్రేషన్ నుంచి రెడ్ హాట్ బికినీ ఫోటోల్ని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈలోగానే సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల విహారం గూగుల్లో ట్రెండింగ్ గా మారింది.

రకుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల టూర్ లో ఉందిప్పుడు. ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్ల మంది అనుచరుల కోసం అక్కడి నుంచి లైవ్ అప్ డేట్స్ ని అందిస్తోంది. వరుసగా తన సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా రివీల్ చేస్తోంది.

తాజాగా తన సోదరుడు అమన్ తో కలిసి ఈత కొలనులో ఉన్నప్పటి ఫోటోని రకుల్ షేర్ చేసింది. “సూర్యాస్తమయంలో పూల్ సైడ్ ఈ మూర్ఖుడు” అంటూ కాస్త ఘాటైన క్యాప్షన్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది రకుల్. అయితే మూర్ఖుడు అని ప్రస్థావించినా హార్ట్ ఎమోజీలతో తన సోదరుడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది. ‘తోబుట్టువుల ప్రేమ’ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది.

ఇంతకుముందు రకుల్ ఆకుపచ్చ స్విమ్ సూట్ ధరించి చెక్క డెక్ మీద ఉన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. “సముద్రం వాసన.. సువిశాల ఆకాశాన్ని అనుభూతి చెందండి.. మీ ఆత్మను స్వేచ్ఛగా ఎగరనివ్వండి“ అనే ట్యాగ్ ని జోడించింది.

రకుల్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో కొన్ని ఇతర పోస్ట్ లను కూడా పంచుకుంది. ఒక వీడియో లో సముద్రంలోకి దూసుకెళుతున్నట్టు కనిపిస్తోంది. “ఇది అందంగా లేదు?” … “లేదు.. ఇది బాగుంది“ అంటూ ఆ వీడియోలో ఒకటే హడావుడి చేసేసింది రకుల్.

అజయ్ దేవగన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్- దేవగన్-రకుల్ ముఖ్యపాత్రలతో `మేడే` అనే సినిమా సెట్స్ కెళ్లనుంది. ఈ మూవీలో రకుల్ ఓ కథానాయికగా నటిస్తోంది. దేవగన్ సర్ తో ఇంతకుముందు పని చేశాను. ఆయనతో కలిసి సహ-పైలట్ గా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ అతను నా సహనటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా. నేను నటి కావాలనుకున్నప్పుడ మిగతా ఔత్సాహిక నటుల మాదిరిగానే మిస్టర్ బచ్చన్ తో కలిసి పనిచేయాలని కలలు కన్నాను.ఈ చిత్రంతో అతనితో స్క్రీన్ స్థలాన్ని పంచుకోవాలనే నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది“ అని రకుల్ అంది.