రకుల్ పంచ్ వెనక అంతరార్థం అర్థమైందా?

0

అందాల రకుల్ ప్రీత్ సింగ్ పై రకరకాల ఆరోపణలు అభిమానుల్ని కలవరపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం (డ్రగ్స్) కేసులో కి మీడియా రకుల్ పేరును డ్రాగ్ చేసింది. ఇందులో నిజానిజాలపై దర్యాప్తునకు సంబంధించి గత నెలలో ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఎదుట హాజరైన రకుల్ ప్రీత్ .. ఆ తర్వాత తనకు ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేదని.. విచారణకు సహకరించేందుకే ఎన్.సి.బి ఎదుటకు వచ్చానని వెల్లడించారు.

అక్కడ విచారణ పూర్తవ్వగానే విమానం ఎక్కి హైదరాబాద్ లో దిగిపోయింది రకుల్. ఇక్కడ మామూలుగానే క్రిష్ తో కలిసి షూటింగుల్లో పాల్గొనడం చర్చకొచ్చింది. రకుల్ ప్రస్తుతం క్రిష్ – వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఓ కొండ ప్రాంతం లోని గ్రామీణ పరిసరాలలో సినిమా కథ నడుస్తుంది. రకుల్ ఒక పోడు వ్యవసాయం చేసే కార్మికురాలిగా కనిపించనుంది. పంజా వైష్ణవ్ తేజ్ కూడా రోజువారీ వేతన కార్మికుడి పాత్రను పోషిస్తున్నాడు.

వైష్ణవ్ లుంగీ ధరించి దర్శకుడు క్రిష్తో మాట్లాడుతున్న ఫోటోల్ని రకుల్ ఇంతకుముందు రివీల్ చేశారు. ఇక తాజా వీడియోలో రకుల్ డీగ్లామర్ లుక్ బయటపడకుండా దాచేయడం క్యూరియాసిటీని పెంచుతోంది. “పని ఎప్పుడూ ఆగదు“` అంటూ సింపుల్ కొటేషన్ తో రకుల్ టీజ్ చేసింది మరి. కొండపొలం బృందం వర్షంలో కెమెరాను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాన వరద వచ్చినా ఏదీ ఆగదు. ఆరోపణలు వచ్చినా ఆగదు!! అంటూ కౌంటర్ వేసినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం వికారాబాద్ అడవిలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు షూటింగులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్న సంగతి తెలిసినదే.

.@Rakulpreet shares a sneak-peek from the sets of her next with @DirKrish & #VaisshnavTej ✨