75 మంది డిగ్రీ విద్యార్ధులకి సోకిన కరోనా

0

కరోనా కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా కాటేస్తుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంది అని చెప్తున్నా కూడా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ లో కూడా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల అయ్యప్పగుట్ట దగ్గరున్న గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్లు సిబ్బంది 75 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డా.శ్రీధర్ చెప్పారు. డిగ్రీ చదువుతున్న వివిధ గ్రామాలకు చెందిన 280 మంది స్టూడెంట్లకు శనివారం కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. 67 మంది స్టూడెంట్లకు 8 మంది స్టాఫ్ కి కరోనా సోకినట్లు తేలింది.

గత సోమవారం డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 258 మంది కాలేజ్ కి వచ్చారు. వీరికి కాలేజ్ లో బుక్స్ ఇచ్చి క్లాసులు నిర్వహించారు. వీరిలో కొందరికి జ్వరం రావడంతో అనుమానంతో కరోనా టెస్టులు చేశారు. స్టూడెంట్లకు స్థానిక హాస్టల్ రూమ్ లలో ఐసోలేషన్ సదుపాయాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని జిల్లా వైద్యాధికారి శ్రీధర్ చెప్పారు. రూల్స్కు విరుద్ధంగా రెండు నెలలుగా 200 మంది సీనియర్స్టూడెంట్లకు క్లాసులు నిర్వహిస్తున్నారని తాము ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదని సిబ్బంది వాపోయారు. తమ పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలుసుకుని ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శనివారం ఈ కళాశాలలో వైద్యాధికారులు సుమారు 283 మంది విద్యార్థినులు 12 మంది అధ్యాపకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 67 మంది విద్యార్థినులు మరో 8 మంది అధ్యాపకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై డీఎంహెచ్ వో శ్రీధర్ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ల అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.