యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

‘భీమ్లా నాయక్’ లో పవన్ లుక్ క్రెడిట్ అంతా రజనీకే..!

0

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – ఇటీవల వచ్చిన టైటిల్ సాంగ్ – ‘లాలా భీమ్లా’ సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా లుంగీలో దర్శనమిచ్చిన ఉన్న పవన్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ‘వకీల్ సాబ్’ లో నల్లకోటులో కనిపించిన పవన్.. ఒక్కసారిగా లుంగీ అవతార్ లో ఆశ్చర్యపరిచారు.

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకుని కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అయ్యారు. అలానే ఇందులో పోలీస్ గా కూడా పవన్ లుక్ డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ పోలీసాఫీసర్ గా కాకుండా.. రూరల్ ఏరియాకు చెందిన రియల్ పోలీస్ లుక్ లో సింపుల్ గా కనిపించారు. ఇక నిత్యా మీనన్ తో కలిసి ఉన్నప్పుడు కాటన్ షర్ట్ ప్యాంటు ధరించి కొత్తగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ లుక్ క్రెడిట్ అంతా స్టైలిస్ట్ రజనీ కే చెందుతుంది.

‘వకీల్ సాబ్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన రజనీ.. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ చిత్రంలోనూ పవన్ కళ్యాణ్ కు స్టైలిస్ట్ గా పనిచేస్తున్నారు. రజినీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ రా అండ్ పల్లెటూరి పోలీసాఫీసర్ గా నటిస్తున్నందున స్టైలింగ్ ను సింపుల్ గా ఉంచాలనుకుంటున్నట్లు తెలిపారు. పవన్ తన పాత్రకు తగినట్లుగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తి అని.. కేవలం రెండు గంటల్లోనే స్టార్ హీరో దాదాపు 15 కాస్ట్యూమ్స్ ట్రై చేశాడని రజనీ వెల్లడించారు.

”పవన్ తన లుక్ కోసం చాలా కాస్ట్యూమ్ ట్రయల్స్ చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయనకు చాలా ఓపిక. వినయం ఎక్కువ. అతను ఎల్లప్పుడూ ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడని నేను గ్రహించాను. స్టైలింగ్ చేయడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు” అని అన్నారు. ఈ సందర్భంగా ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ 6-7 డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారని ఈ సందర్భంగా రజనీ వెల్లడించారు.