షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అల్లరి నరేష్ ‘నాంది’…!

0

హాస్యభరిత చిత్రాలతో వెండితెరపై నవ్వులు పంచిన అల్లరి నరేష్ తన పంథా మార్చుకొని నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ”నాంది”. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అల్లరి నరేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన ‘నాంది’ – ఎ న్యూ బిగినింగ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు – ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ టీజర్ అన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘నాంది’ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి న్యూ పోస్టర్ విడుదల చేశారు.

‘నాంది’ కొత్త పోస్టర్ లో అల్లరి నరేష్ కిటికీ దగ్గర నిలబడి గట్టిగా అరుస్తూ తన బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ ఇంతకముందు ఎప్పుడూ పోషించనటువంటి వైవిద్యమైన పాత్రలో నటిస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ – నవమి – హరీష్ ఉత్తమన్ – ప్రియదర్శి – ప్రవీణ్ – దేవి ప్రసాద్ – వినయ్ వర్మ – నర్సింహారావు – శ్రీకాంత్ అయ్యంగార్ – రమేష్ రెడ్డి – చక్రపాణి – మణిచందన ప్రమోదిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సిద్ జే సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేసారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి సంభాషణలు అందించారు.