రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై జీవిత ఏమన్నారు?

0

ప్రస్తుతం హీరో రాజశేఖర్ ఆరోగ్యపరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రశ్నకు ఇంతకుముందు ఆస్పత్రి వర్గాలు సమాధానమిచ్చాయి. ప్లాస్మా థెరపీతో చికిత్సకు స్పందించారని వెల్లడించాయి. ఆయన బాగానే ఉన్నాడని తెలపడంతో అభిమానుల మనసు కుదుట పడింది. అయితే రాజశేఖర్ సతీమణి జీవిత ఏమని అన్నారు? అంటే…

జీవిత ఇటీవల స్పందిస్తూ 80శాతం రికవరీ అయ్యారని తెలిపారు. కోవిడ్ 19 ప్రభావం తగ్గిందని వెల్లడించారు. “గత మూడు రోజుల నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది. అన్ని ఇన్ఫెక్షన్లు ఇప్పుడు తగ్గాయి. బాగా కోలుకున్నారు. నేను ప్రస్తుతం వైద్యులతో టచ్ లో ఉన్నాను. రాబోయే రెండు రోజుల్లో ఐసియు నుంచి జనరల్ వార్డుకి తరలించనున్నారు. అతన్ని ఐసియు నుండి తరలించే ముందు మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. చికిత్స విషయంలో మేం చాలా సానుకూలంగా ఉన్నాం. రాజశేఖర్ మా అందరితో మాట్లాడుతున్నారు“ అని జీవిత తెలిపారు. నేను నా కుమార్తెలు కరోనావైరస్ నుండి పూర్తిగా కోలుకున్నామని వెల్లడించారు.

ఇటీవల రాజశేఖర్ – జీవిత సహా శివానీ శివాత్మికలకు కోవిడ్ 19 కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాజశేఖర్ మినహా మిగతా అందరూ త్వరగా ఈ వ్యాధి భారి నుంచి కోలుకున్నారు. అయితే రాజశేఖర్ చికిత్స విషయంలోనే కుటుంబం ఆందోళన చెందింది. ఎట్టకేలకు మెరుగైన చికిత్సతో రాజశేఖర్ కోలుకుంటున్నారని జీవిత చెప్పడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.