ఇంతందమైన భూమిని మన అగ్ర హీరోలు కరుణించరేం?

0

హిందీ చిత్రసీమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్లతో పోటీపడుతోంది భూమి పెడ్నేకర్. అందానికి అందం హాట్ అప్పీల్ ప్రతిభ ఈ అమ్మడిని గ్రాఫ్ లో పైపైకి లాక్కెళుతున్నాయి. సక్సెస్ రేటు అదరడంతో క్రేజీ గాళ్ గా వెలిగిపోతోంది. అందుకే భూమి కి సంబంధించిన ప్రతిదీ బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బాలీవుడ్లో ప్రముఖ నటులలో టాప్ 10లో చోటు దక్కించుకునే స్థాయిలో ఉంది. సక్సెస్ క్వీన్ గా సోషల్ మీడియాలో అద్భుత ఫాలోయింగ్ పెంచుకుంది. తన అనుచరులకు నిరంతరం ఇన్ స్టా మాధ్యమంలో టచ్ లో ఉంటోంది ఈ బ్యూటీ. ఇక్కడ వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తోంది. తాజాగా భూమి పెడ్నేకర్ ‘బధాయి హో’ ప్రిపరేషన్ లో ఉందిప్పుడు. దీనికి సంబంధించి తన ‘డే 1’ స్నీక్ పీక్ ను సోషల్ మీడియాలో పంచుకోగానే జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోయింది. అలాగే భూమి షేర్ చేసిన రెడ్ హాట్ డిజైనర్ లుక్ ఒకటి అంతే వేగంగా వైరల్ అయ్యింది.

తాజాగా భూమి తన ఇన్ స్టా గ్రామ్ లో తన గందరగోళ పరిస్థితిని వెల్లడించే సెల్ఫీని పంచుకుంది. ఇందులో నో-మేకప్ లుక్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. చాలా సాధారణ దుస్తులను ధరించి.. మేకప్ లెస్ ఫోజుతోనూ అమ్మడు మంచి మార్కులే కొట్టేసింది. “ఇన్ స్టేట్ ఆఫ్ యుటర్ కన్ఫ్యూషన్ !!!” అన్న కామెంట్ ని దీనికి జత చేయడంతో ఏంటా కన్ఫ్యూజన్న అన్నది కనిపెట్టే పనిలో పడ్డారంతా.

భూమి కెరీర్ సంగతి చూస్తే.. COVID-19 వ్యాప్తి కారణంగా పని నుండి విరామం తీసుకుని లేటెస్టుగా తదుపరి చిత్రం ‘బధాయ్ హో’ కోసం తిరిగి పనిని ప్రారంభించింది. ఇందులో రాజ్ కుమార్ రావుతో కలిసి నటిస్తోంది. చిత్రీకరణలో భాగంగా ప్రిపరేషన్ ప్రారంభించింది. ఈ చిత్రం జనవరి 2021 నుంచి సెట్స్ కెళ్లనుంది. అన్నట్టు ఇంత అందమైన ఈ భూమిని మన అగ్ర హీరోలు కరుణించరేం? సౌత్ కి వెల్ కం చెప్పరేం? అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి.