పెళ్ళైన వెంటనే షూటింగ్ లో పాల్గొననున్న చందమామ..!

0

మెగాస్టార్ చిరంజీవి – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఆచార్య”. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై రామ్ చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. కొన్ని రోజులు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి కరోనా మహమ్మారి వచ్చి బ్రేక్స్ వేసింది. అయితే అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమా షూటింగ్స్ అన్నీ ఈ మధ్య తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ‘ఆచార్య’ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది.

కాగా ‘ఆచార్య’ షూటింగ్ నవంబర్ 3వ తేదీ నుంచి మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 45 రోజుల పాటు కంటిన్యూగా సాగే ఈ షెడ్యూల్ లో సినిమాలోని మేజర్ సన్నివేశాలు చిత్రీకరించడానికి టీమ్ ప్లాన్ చేస్తున్నారు. రేపు(అక్టోబర్ 30) పెళ్లి పీటలు ఎక్కబోతున్న చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళైన వెంటనే ‘ఆచార్య’ టీమ్ తో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో కాజల్ ‘ఆచార్య’ సెట్స్ లో అడుగుపెడుతుందని సమాచారం. సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.