లైంగిక వేధింపుల్లో స్టార్ డైరెక్టర్ బుక్కయ్యాడు

0

#మీటూ ఉద్యమం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. చాలా మంది ఈ ఉద్యమం కారణంగా అరోపణలు ఎదుర్కొన్నారు. భారీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని కొంత మంది కోల్పోతే మరి కొంత మంది దర్శకులు క్రేజీ అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో హౌస్ ఫుల్ దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా వున్నారు. తాజాగా మరో సారి ఈ దర్శకుడు లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

హౌస్ ఫుల్ 1- హౌస్ ఫుల్ 2 చిత్రాలతో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న సాజిద్ ఖాన్ మీటూ ఆరోపణల కారణంగా పలు క్రేజీ చిత్రాలను వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా అతనిపై సౌలా అనే ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. హౌజ్ ఫుల్ సినిమా ఆఫర్ అంటూ తనని దర్శకుడు లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ సినిమా సమయంలో సాజిద్ ఖాన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో తాజాగా వెల్లడించింది.

మీటూ ఉద్యమం మొదలైనప్పుడు సాజిద్ పై చాలా విమర్శలు వినిపించాయి అయితే తాను ధైర్యం చేయలేకపోయానని చెబుతోంది. కుటుంబం కోసమే మౌనంగా వున్నానని సొంతం గా సంపాదించడం మొదలుపెట్టాక తనలో ధైర్యం ఏర్పడిందని అందుకే ఇప్పుడు నోరు విప్పుతున్నానని చెప్పుకొచ్చింది. హౌస్ ఫుల్ సీక్వెల్ లో అవకాశం రావాలంటే తన ముందు నగ్నంగా నిలబడాలని సాజిద్ ఖాన్ అన్నడని అవకాశం వంకతో తనని ఎక్కడ పడితే అక్కడ తాకేవాడని చెప్పుకొచ్చింది.