ఆహాని చూసి.. కొరివితో తల గోక్కుంటారా?

0

చాలా ముందు చూపుతో ఆహా-తెలుగు ఓటీటీని ప్రారంభించారు అల్లు అరవింద్. కానీ దీనిని సక్సెస్ చేసేందుకు ఆయన పెడుతున్న పెట్టుబడులు చూసి చాలామందికి కళ్లు భైర్లు కమ్ముతున్నాయి. వందల కోట్లను వెచ్చిస్తున్నారన్నది థింక్ చేస్తేనే సౌండ్ ఉండదు. అయినా.. కొరివిని చూసి దాంతోనే తల గోక్కున్నట్టు ఈ రంగంలోకి పలువురు రంగ ప్రవేశం చేయనున్నారని తెలిసింది. ఇంతకీ ఎవరా నిర్మాతలు కం సౌండ్ పార్టీలు? అంటే.. ఇప్పటికి సస్పెన్స్.

ఆహాకి ఆరంభం అంతగా క్రేజు లేదు. కానీ నెమ్మదిగా పెంచేందుకు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలి కాలంలో ఆహా యాప్ కి తెలుగునాట క్రేజ్ పెంచుతున్న వి ఏవి? అంటే.. మళయాలీ డబ్బింగ్ సినిమాలేనని చెప్పాలి. ఒరిజినల్ కంటెంట్ ని మించి ఇవి ఆదరణ పొందుతున్నాయి. ఇతర ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో ఉన్న ఇతర భాషా హిట్ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి ఆహా లో విడుదల చేయడం ప్లస్ అవుతోంది.

ఇటీవలే `ఫోరెన్ సిక్` అనే మళయాలం డబ్బింగ్ సినిమాతో మొదలుపెట్టి ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదల చేశారు. ఈ డబ్బింగ్ సినిమాలుతో ఆహా కు తెలుగులో వ్యూయర్ షిప్ బాగానే పెరిగింది. దానికి తోడు కంటెంట్ ని కూడా ఫిల్టర్ చేసి వదులతుండటంతో ఈ ఓటిటి వైపు తెలుగు సినిమా నిర్మాతలు కూడా దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఎవరైనా పెద్ద హీరో సినిమాకి డిజిటల్ పార్టనర్ గా వ్యవరిస్తే ఆహా మరింతగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నది అనుభవజ్ఞుల విశ్లేషకుల సూచన. మరి ఈ యాప్ కి బ్రాండింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ అప్ కమింగ్ సినిమాకి ఆహానే స్టీమింగ్ పార్టనర్ గా ఉంటుందేమో చూడాలి..!