Templates by BIGtheme NET
Home >> Cinema News >> అల్లు అర్హ సో క్యూట్.. అక్కడో పెక్ ఇక్కడో పెక్

అల్లు అర్హ సో క్యూట్.. అక్కడో పెక్ ఇక్కడో పెక్


టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఎంత అల్లరి పిడుగో చెప్పాల్సిన పనే లేదు. తాత అల్లు అరవింద్ .. డాడీ అల్లు అర్జున్ లనే కాదు ఇంటిల్లిపాదినీ ఆటపట్టిస్తూ అర్హ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మొన్న నిహారికా కొనిదేలా పెళ్లిలోనూ అర్హ సందడి మామూలుగా లేదు. అక్కడ పిన్ని నిహారికకు ఒక పెక్ (బుగ్గపై ముద్దు).. బాబాయ్ చైతన్యకు ఒక పెక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ క్యూట్ లవ్ లీ వీడియో అంతర్జాలంలో సునామీలా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ గా షేర్ చేస్తుండడం ఆసక్తికరం.

ఇది నిహారికా ప్రీ-వెడ్డింగ్ వేడుక నుండి రివీలైంది. నిహారిక ఎంతో అందంగా నవ్వేస్తుంటే చటుక్కున బుగ్గపై పెక్ ఇచ్చింది అర్హ. పక్కనే ఉన్న చైతన్యకు కూడా అలానే పెక్ తో మురిపించింది. అదే పెళ్లిలో అల్లు అర్జున్ – స్నేహ వారి పిల్లల అద్భుతమైన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసినదే. బన్ని- స్నేహ జంట ఫేవరెట్ పెయిర్ గానూ ఓ వెలుగు వెలిగారు ఈ వేడుకలో