Templates by BIGtheme NET
Home >> Cinema News >> డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిసిన బిగ్ బాస్ విన్నర్..!!

డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిసిన బిగ్ బాస్ విన్నర్..!!


తెలుగు బిగ్ బాస్ సీజన్ 4.. ఎంత రసవత్తరంగా జరిగిందో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కంటెస్టెంట్ లను బిగ్ బాస్ ఫాలోయర్స్ సెలబ్రిటీల అభిమానులు సోషల్ మీడియా యూసర్లు ఓట్లు వేస్తూ తమ అభిమాన కంటెస్టెంట్ ని గెలిపిస్తూ వచ్చారు. చివరిగా టైటిల్ గెలిచింది అభిజిత్. బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడో లేదో అలా తన గెలుపుకు తన కెరీర్ కి సహాయపడిన వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉన్నాడు. టైటిల్ విన్ అయినప్పుడే గెలిపించిన అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన అభిజిత్.. బయటికి రాగానే తనకు బయటి నుండి సపోర్ట్ అందించిన విజయ్ దేవరకొండ నాగబాబు లాంటి వాళ్ళను కలుస్తూ థాంక్స్ చెబుతున్నాడు. ఇప్పటికే తన సినీ కెరీర్ కి కారణమైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ టీమ్ తో సందడి చేసిన అభిజిత్.

తాజాగా తనకు సినిమా ఛాన్స్ ఇచ్చి హీరోని చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిసాడు. ఇద్దరు కలిసి చాలాసేపు పాత ముచ్చట్లు మాట్లాడుకున్నారు. అనంతరం శేఖర్ కమ్ములను ఉద్దేశించి.. “సింప్లిసిటీ హ్యుమిలీటి రెస్పెక్ట్.. సినిమాలకంటే ఎక్కువగా నేర్పారు. థ్యాంక్స్ మీ శీను” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ కప్ గెలిచిన దగ్గర నుండి అభిజిత్ తీరిక లేకుండా సన్నిహితులను సెలబ్రిటీలను కలుస్తూనే ఉన్నాడు. వారితో విన్నింగ్ పార్టీలు చేసుకుంటూనే ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములను కూడా కలిసి ఎమోషనల్ అయ్యాడు అభి. వారిద్దరూ పాత స్నేహితులు కావడంతో అప్పటి విషయాలను మాట్లాడుకున్నారట. ఇక చివరిగా తనకు సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన తర్వాతే తన పనులు స్టార్ట్ చేస్తానని చెప్పాడు అభిజిత్. ఇక మనోడికి ఇండస్ట్రీ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. మరి ఏం చేస్తాడో చూడాలి.