స్టైలిష్ బన్నీ రెడీ టు ‘పుష్ప’స్టైలిష్ బన్నీ రెడీ టు ‘పుష్ప’

0

అల్లు అర్జున్ గత ఆరు ఏడు నెలలుగా పుష్ప సినిమా కోసం గడ్డం మరియు జుట్టు పెంచాడు. షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నా కూడా గడ్డం మరియు జుట్టు కొద్ది కొద్దిగా కట్ చేయించుకుంటూ వచ్చాడు తప్ప ఇప్పటికి అదే లుక్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. బన్నీ పుష్ప సినిమాలో లారీ డ్రైవర్ గా.. ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు అంటూ యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కథలో ఏదో ట్విస్ట్ అయితే ఉంటుందని కాని విడుదలైన ఫస్ట్ లుక్ ను బట్టి చూస్తుంటే ఎర్ర చందనం దుంగల స్మగ్లర్ గా బన్నీ కనిపించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు నవంబర్ మొదటి వారంలో మొదలు కాబోతుంది. వైజాగ్ తో పాటు గోదావరి జిల్లాల్లో ఈ సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్న బన్నీ ఇటీవల ఇలా బ్లాక్ అండ్ బ్లాక్ లో తాజాగా కనిపించాడు. ఈ లుక్ సింపుల్ అండ్ స్టైలిష్ గా ఉందని.. పుష్పలో ఇదే లుక్ తో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అల వైకుంఠపురంలో బంటు పాత్రతో పోల్చితే పుష్ప సినిమాలో ఫిజికల్ గా స్ట్రాంగ్ గా కనిపించడంతో పాటు కాస్త బరువు తక్కువగా కనిపించబోతున్నట్లుగా ఈ ఫొటోను బట్టి అర్థం అవుతుంది. ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది మార్చికి వాయిదా పడింది. మార్చిలో కేరళకు వెళ్లి చిత్రీకరించాలని భావిస్తున్న సమయంలో కరోనా మహమ్మారి ఎటాక్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పుష్ప పట్టాలెక్కలేదు. నవంబర్ మొదటి వారంలో సినిమా షూటింగ్ షురూ అయ్యే అవకాశం ఉంది.