బన్నీకి రౌడీ బ్రాండ్ గిఫ్ట్

0

విజయ్ దేవరకొండ రౌడీ పేరుతో సొంత బ్రాండ్ ను ఏర్పాటు చేసి యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడు. గత కొంత కాలంగా తన బ్రాండ్ నుండి ఏ కొత్త ఉత్పత్తులు వచ్చినా కూడా ఇండస్ట్రీలో కొందరికి విజయ్ దేవరకొండ పంపిస్తూ వస్తున్నాడు. తాజాగా మరో సారి తన కొత్త డిజైన్స్ ను విడుదల చేశాడు. అల్లు అర్జున్ కు విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ టీ షర్ట్.. ట్రాక్.. మరియు స్పెషల్ మాస్క్ లను కూడా పంపించాడు. విజయ్ దేవరకొండ నుండి బన్నీ అందుకున్న ఈ స్పెషల్ బహుమానం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అల్లు అర్జున్ ఈ బ్రాండ్ ప్రమోట్ అయ్యేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. థ్యాంక్యూ సోమచ్ విజయ్.. నీ కొత్త కలెక్షన్స్ చాలా బాగున్నాయి అంటూ బన్నీ పేర్కొన్నాడు. బ్లాక్ అండ్ వైట్ స్టైలిష్ లుక్ తో టీషర్ట్ ట్రాక్ చాలా బాగున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ త్వరలో ఈ రౌడీ బ్రాండ్ లో కనిపిస్తాడేమో చూడాలి. గతంలో కూడా అల్లు అర్జున్ కు రౌడీ స్టార్ కాంప్లిమెంటరీగా తన కొత్త కలెక్షన్స్ ను పంపించిన విషయం తెల్సిందే.