ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మొదలు

0

ఆల్ ఇండియా సూపర్ స్టార్ క్రేజ్ తో దూసుకు పోతున్న ప్రభాస్ పుట్టిన రోజుకు మరో 50 రోజులు ఉంది. అప్పుడే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి మొదలు పెట్టారు. ఈమద్య కాలంలో స్టార్స్ బర్త్ డే కు కామన్ డీపీలు విడుదల చేయడం జరుగుతుంది. ప్రభాస్ పుట్టిన రోజు మరో 50 రోజులు ఉండగానే కామన్ డీపీని విడుదల చేశారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ రోజున రాధే శ్యామ్ టీజర్ లేదా మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నారు.

నాగ్ అశ్విన్ మరియు ఆదిపురుష్ ల సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీతో ఫ్యాన్స్ కు కానుక వచ్చింది. బాహుబలిలోని స్టిల్ ను ఉపయోగించి ప్రభాస్ ఈశ్వర్ సినిమా నుండి రాధేశ్యామ్ సినిమా వరకు టైటిల్స్ ను డిజైన్ లో ఉంచడం జరిగింది. ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా డిజైన్ చేశారు. ప్రభాస్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

నిన్నంత తన ట్రైనర్ కు రేంజ్ రోవర్ కారును బహుమానంగా ఇవ్వడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ప్రభాస్ ఇప్పుడు కామన్ డీపీతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అత్యధిక ట్వీట్స్ అభిమానులు చేస్తున్నారు. ప్రభాస్ త్వరలో చేయబోతున్న ఆదిపురుష్ సినిమా కోసం మొత్తం ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.