కరోనా బారిన పడ్డ స్టార్ హీరో

0

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. అందరికీ వ్యాపిస్తూనే ఉంది. కరోనా కు కేంద్రంగా మహారాష్ట్ర ఉంది. అందులోనూ ముంబైలో తీవ్రత ఎక్కువగా ఉంది. ముంబైలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ అభిషేక్ ఐశ్వర్య సహా చాలా మందికి సోకింది.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ రెజ్లర్ దీపక్ పూనియా కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిద్దరూ వైరస్ లక్షణాలు లేకున్నా.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. డాక్టర్ల సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో తమను కలిసిన వారు పరీక్షలు చేసుకోవాలని హీరో అర్జున్ కపూర్ సూచించారు.

అర్జున్ కపూర్ ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో తనకు కరోనా వచ్చిందని.. లక్షణాలు మాత్రం లేవని.. ఇది అసింప్టోమేటిక్ గా నిర్ధారించారని తెలిపారు. క్వారంటైన్ లో ఉన్నట్టు వివరించాడు. కాల్స్ అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్నాయని.. చేయవద్దని కోరారు. తాను క్వారంటైన్ లో ఉంటున్నట్టు వివరించాడు.

ఇక ప్రముఖ రెజ్లర్ దీపక్ పూనియా కూడా కరోనా బారినపడ్డారు. ఆయనలో కూడా లక్షణాలు కనిపించలేదు. క్వారంటైన్ లో ఉన్నాడు.