రియా తండ్రి సంచలన వ్యాఖ్యలు

0

సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం ఆ కేసుతో రియాకు సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవ్వడం ఆ తర్వాత ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం వంటివి చకచక జరిగి పోయాయి. ఈ కేసులో రియా కుటుంబ సభ్యలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. కేసుతో సంబంధం లేకున్నా ఇప్పటికే వారిని మీడియా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించింది. తాజాగా ఎన్ సీ బీ వారు శోవిక్ ను అరెస్ట్ చేయడంతో ఇప్పుడు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది.

ఈ సమయంలో రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఇంద్రజిత్ మాట్లాడుతూ కంగ్రాట్స్ ఇండియా. నా కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇక తర్వాత అరెస్ట్ కాబోతున్నది నా కూతురు అనేది నాకు తెలుసు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సమర్థవంతంగా నాశనం చేయగలిగారు. న్యాయం పేరుతో అన్యాయం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు.

ఈ కేసులో రియా కుటుంబంను అనవసరంగా ఇరికిస్తున్నారు అంటూ మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇంద్రజిత్ వ్యాఖ్యలు చాలా మందికి ఆవేదన కలిగిస్తున్నాయి. రియా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అవ్వడం వల్ల ఆమెను ఇలా టార్గెట్ చేశారంటూ ఆమె సన్నహితులు మరియు కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.