నూతన్ నాయుడి పై మరో కేసు

0

శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్ నాయుడి పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో నూతన్ భార్యతోపాటు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వారిని కాపాడే ప్రయత్నంలో ప్రముఖల పేర్లతో ఫోన్లు చేసి నూతన్ బుక్కయ్యాడు.

తాజాగా నూతన్ పై మరో కేసు నమోదైంది. ఆగస్టు 29న ప్రముఖ వ్యక్తి పేరుతో ఫోన్ చేశాడు నూతన్. వైద్యపరీక్షల్లో అతడి భార్య రిపోర్టును మేనేజ్ చేయాలని కోరాడు. దీంతో సదురు డాక్టర్ కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నూతన్ నాయుడి పై చీటింగ్ కేసు నమోదైంది.

నూతన్ నాయుడు ఇప్పటికే ఏపీసీఎంవో కార్యదర్శి పీవీ రమేశ్ పేరును వాడి ఫేక్ కాల్స్ చేశాడని కేసు నమోదైంది. ఇప్పుడు డాక్టర్ సుజాత సీఐ సూరిబాబు ఫిర్యాదుతో గాజువాకలో మరో కేసు నమోదైంది.

ఇక కంచెరపాలెంలో మరో బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నూతన్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. దీంతో మొత్తం 4 కేసులు నూతన్ పై నమోదయ్యాయి.