ఆహా ప్రమోషన్ లో బన్నీ

0

అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ బాధ్యతను అల్లు అర్జున్ తీసుకోబోతున్నాడా అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అధికారికంగా అంబాసిడర్ గా వ్యవహరించకున్నా ఇకపై ఆహాకు సంబంధించిన సినిమాలు మరియు షో లను ప్రమోట్ చేయాలని బన్నీ భావిస్తున్నాడట. ఇప్పటికే ఆహా లో విడుదల అయిన కలర్ ఫొటో సనిమా యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా కలిసి వారిని అభినందించిన అల్లు అర్జున్ ఆహా కోసం ఒక ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు.

ఆహాలో పలు సినిమాలు మరియు టాక్ షో లు వెబ్ సిరీస్ లను అతి త్వరలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వాటిని అల్లు అర్జున్ తో అనౌన్స్ చేయించబోతున్నారు. ఈ విషయమై ఆహా ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ వాటిని ప్రకటించబోతున్నారు. అందులో సమంత టాక్ షో కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఆహా కు అల్లు అర్జున్ ప్రమోషన్ తో మరింతగా ఆధరణ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఆహాకు భారీగా ఖాతాదారులు చేరారు. తెలుగు ప్రత్యేకమైన ఓటీటీ అవ్వడంతో తెలుగు వారికి ఆహా బాగా కనెక్ట్ అవుతోంది.