Templates by BIGtheme NET
Home >> Cinema News >> పూర్వీకుల్ని పంచకర్మను పక్కన పెట్టేశామని ఆమె ఆవేదన!

పూర్వీకుల్ని పంచకర్మను పక్కన పెట్టేశామని ఆమె ఆవేదన!


వివాదాలు .. సంచలనాలు అమలాపాల్ కి కొత్తేమీ కాదు. తాను ఏం చేసినా అందులో ఆ రెండూ ఉండాలి. లేకపోతే అది తనకు సంతృప్తిని ఇవ్వదు అన్నట్టుగానే ఇన్నాళ్లు బయటి ప్రపంచానికి తనను తాను ఆవిష్కరించుకుంది. కానీ ఇటీవల ఉన్నట్టుండి ఏమైందో కానీ పాల్ పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టింది. తనలోని యోగినిని పరిచయం చేస్తోంది. పంచకర్మలు అంటూ కొత్త పల్లవి అందుకుంది.

అయితే ఈ విధానం ఇప్పుడే ప్రజలకు తెలిసినది కాదు. కేరళ వైద్యంలో పంచకర్మల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ఏనాడో ఉంది. అయితే కేరళలో పుట్టిన పాల్ ఇప్పటికి వాటిని అనుసరిస్తూ ఇదిగో ఇలా ప్రచారం చేసి పెడుతోంది.

“నా ప్రియమైన తోట…! అంటూ ముచ్చటపడిన పాల్.. నా ప్రొఫైల్ నా జీవితానికి ప్రతిబింబం అని మీకు ఇప్పటికే తెలుసు“ అంటూ ప్రారంభించింది. శారీరకంగా మానసికంగా నా లైఫ్ లో ఉత్తమ సంస్కరణగా మారడానికి నా అంతులేని ప్రయాణంలో నేను పంచకర్మ అనే వైద్య ప్రక్రియ కోసం సైన్ అప్ చేసాను అని పాల్ వెల్లడించింది.

మన వేగవంతమైన జీవితాలలో పాశ్చాత్య ప్రభావంలో చాలా కోల్పోయాం. నిజానికి మన పూర్వీకుల సంపదను మనం అరుదుగా విలువైనదిగా భావిస్తాము. నేటి జనం ఆచరణలో పెట్టడానికి అవసరమైన సమాచార బంగారు గనిని విడిచిపెట్టారు. ఈ చికిత్స పూర్తి పరివర్తన.. ప్రక్షాళన .. పునరుజ్జీవనంకి సంబంధించినది. అరుదైనది. ఈ ప్రక్రియ ద్వారా అపారమైన స్వీయ నియంత్రణ సాధ్యం. దీనికి మనో బలం అవసరం. మనస్సు చేయగల సామర్థ్యం ఉన్న విషయాలతో నేను ఆశ్చర్యపోతున్నాను. 180 ° పరివర్తన నా అనుభవంతో నేను మిమ్మల్ని తీసుకెళుతున్నప్పుడు రాబోయే కొద్ది రోజులు నన్ను అనుసరించండి“ అని తెలిపారు. నా 28 రోజుల పంచకర్మ అనుభవంలో 20వ రోజున ఇదిగో ఇలా ఉన్నాను! అంటూ కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో వదిలింది. ఇంకేం ఉంది ఇవన్నీ జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతున్నాయ్.