అమలాపాల్

0

సౌత్ కాంట్రవర్శీ క్వీన్ గా అమలాపాల్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. వివాదాస్పద కంటెంట్ ఎంచుకోవడమే గాక తన నిత్య వ్యవహారికంలోనే అది ఉందని ప్రూవ్ చేసిన సందర్భాలెన్నో. ఇటీవల అమలాపాల్ ఆధ్యాత్మిక బాటను అనుసరించడం అభిమానుల్ని కలవరపెడుతోంది. ఆ క్రమంలోనే ఫోటోషూట్లను షేర్ చేస్తూ క్లాస్ తీస్కుంటున్న ఈ అమ్మడి వ్యవహారం భయపెట్టేస్తోందన్న కామెంట్లు వినిపించాయి.

ఇంతకుముందు అమలాపాల్ తమిళ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లితో అందరికి షాకిచ్చిన అమలా పాల్ ఏడాది తిరక్కుండానే ఏ.ఎల్. విజయ్ కి విడాకులిచ్చేసి మరో షాకిచ్చింది. కొంత కాలం ఒంటరిగానే లైఫ్ లీడ్ చేసిన అమలా పాల్ ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి లగ్జరీ కార్ ని సొంతం చేసుకుందని… ట్యాక్స్ ఎగవేసిందన్న ఆరోపణలతో అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ప్రారంభంలో పంజాబీ యువకుడు భవీందర్సింగ్తో డేటింగ్ లో వున్న అమలాపాల్ అతన్నే వివాహం చేసుకుని షాకిచ్చింది. ప్రస్తుతం `అదో అంథ పారవై … ఆడు జీవితం.. కడవెర్… లస్ట్ స్టోరీస్ రీమేక్ లలో నటిస్తోంది. నటిగా వరుస వివాదాల్లో చిక్కుకున్న అమల ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇక పాల్ రెగ్యులర్ ట్రీట్ యథావిధిగానే కొనసాగుతోంది.

మరోసారి ఫోటో ట్రీట్ లు మొదలుపెట్టేసింది. నవరాత్రి సందర్భంగా రోజుకో ఫొటో షూట్తో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అమలా పాల్ ఇన్ స్టా వేదికగా షేర్ వివిధ భంగిమల్లో ఫొటోలని షేర్ చేసింది. థిక్ పింక్ కలర్ లో నెట్ డిజైన్ డ్రెస్ లో హొయలు పోతూ ఫొటోలకి పోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇన్ స్టాలో సందడి చేస్తున్నాయి. పాల్ బ్రాండ్ కిర్రాక్ ఫోజు అదిరెనులే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు జోడిస్తున్నారు.