అఖిల్ కు విజయం కోసం ఆమె మరోసారి బరిలోకి!

0

సిసింద్రీ.. ఇంటిల్లిపాదికి నచ్చిన చక్కని సినిమా. చిన్న పిల్లలనై తే విపరీతం గా ఆకట్టు కుంది. ఏడాది వయసుకే అఖిల్ కు చక్కటి గుర్తింపు తెచ్చింది. చిన్న పిల్లలంతా సిసింద్రీని తెగ లైక్ చేసే వారు. అప్పట్లో చిన్నపిల్లల గ్రీటింగ్ కార్డ్ అంటే చాలు సిసింద్రీ బొమ్మ ఉండాల్సిందే. అంతలా ప్రేక్షకులకు చేరువైంది ఈ సినిమా. ఈ సినిమాలో బుల్లి అఖిల్ కు అమ్మగా ఆమని చక్కగా ఒదిగి పోయింది. తెరపై చూస్తున్నంత సేపు వారిద్దరూ అమ్మ బిడ్డగానే కనిపిస్తారు. ఆమని చక్కటి ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమా విడుదలై పాతికేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమని ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆనాటి విశేషాలను పంచుకుంది. ‘సిసింద్రీ సినిమా కోసం నాగార్జున అడగ్గానే అఖిల్ కు అమ్మగా నటించేందుకు ఒప్పుకున్నా. ముందు గా ఈ సినిమా ను 30 రోజుల్లో పూర్తి చేద్దాం.. అనుకుంటే 60 రోజుల షూటింగ్ జరిగింది.

ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. అంత చిన్న పిల్లాడితో షూటింగ్ అంటే చాలా కష్టం. అందుకే షూటింగ్ కి ఎక్కువ రోజులు తీసుకున్నాం. అఖిల్ కి ఆడుకునే మూడ్ ఉన్నప్పుడు చిత్రీకరణ జరిపే వాళ్ళం. అఖిల్ నిద్రపోతున్నప్పుడు మిగతా వాళ్లమంతా విశ్రాంతి తీసుకునే వాళ్ళం. షూటింగ్ సమయంలో అఖిల్ చాలా దగ్గరయ్యాడు. సొంత బిడ్డ లాగే అనిపించే వాడు. నన్ను కూడా అమ్మలాగే భావించేవాడు. అమ్మా..అమ్మా అంటూ పిలిచేవాడు. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు సమయమే తెలియలేదు. అంత సరదాగా సాగిపోయింది. అప్పుడే షూటింగ్ పూర్తయిందా.. అనిపించింది. ఇప్పటికీ అఖిల్ కి నేను అంటే ఎంతో ఇష్టం. ఎక్కడున్నా అమ్మా..అమ్మా అని వెతుక్కుంటూ వచ్చి హత్తుకుంటాడు. అఖిల్ కు నాపై ఉన్న ప్రేమను చూస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి అఖిల్ కు అమ్మగా ఓ చేస్తున్నాను. సిసింద్రీ సినిమా కు ఇప్పటికీ నాకు తేడా లేదు. ఇప్పటికీ నాకు అఖిల్ చిన్నపిల్లాడు లాగే అనిపిస్తున్నాడు.’ అని ఆమని తన అనుభవాలను చెప్పుకొచ్చింది. విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఆమని అయిన అందిస్తుందేమో చూడాలి.