‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైలర్

0

విజయ్ రామ్ – శివ్ శక్తి సచ్ దేవ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ”అమరం అఖిలం ప్రేమ”. ఈ చిత్రానికి జోనాధన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించారు. చలన చిత్రాలు బ్యానర్ పై వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ – విజయ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమాను తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ‘కింగ్’ అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇది తండ్రీ కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిన సినిమా అని అర్థం అవుతోంది. తండ్రీ కూతుళ్ళ మధ్య ఎమోషన్ తో పాటు హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ రెండు సమాంతరంగా నడిపినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైలర్ చూశాను. చాలా బావుంది. ‘మరో చరిత్ర’ ‘ఏక్ తూజే కేలియె’ స్టైల్లో అనిపించింది. నాకు ‘బొమ్మరిల్లు’ సినిమా గుర్తుకొచ్చింది. తండ్రీ కూతురు మధ్య అనుబంధాన్ని తెలియజేసే చిత్రమిది. విజయ్ రామ్ – శివ్ శక్తి సచ్ దేవ్ చాలా బాగా నటించారు. సెప్టెంబర్ 18న ఆహాలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. దర్శకుడు జోనాధన్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ..”నేను డైరెక్టర్ కావడానికి నాగార్జున కారణం. ఆయనిచ్చిన ఓ సలహాతో నేను ‘అమరం అఖిలం ప్రేమ’ సినిమాను తెరకెక్కించాను. ఈ హార్ట్ టచింగ్ లవ్స్టోరి అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఆహా బృందానికి ధన్యవాదాలు” అన్నారు. ఈ సినిమాలో నరేశ్ వి.కె – శ్రీకాంత్ అయ్యంగార్ – అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ రధన్ సంగీతం అందించిన ఈ సినిమాకి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.