Templates by BIGtheme NET
Home >> Cinema News >> పేలడానికి సిద్ధంగా ఉన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’

పేలడానికి సిద్ధంగా ఉన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’


స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఇది సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కు కొనసాగింపుగా వస్తోంది. ఈ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే కలిసి నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన మొదటి సీజన్ మంచి ఆదరణ దక్కించుకోవడంతో సీజన్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇందులో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుందని వార్తలు వస్తుండటంతో ఆసక్తి రెట్టింపు అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో ఒక టైం బాంబ్ ని రెడీ చేస్తున్నట్లు చూపించబడింది. ఈ సందర్భంగా ”ఇక్కడ టైమర్ గురించి తెలియదు కానీ త్వరలోనే ఎక్సయిట్మెంట్ తో పేల్చబోతున్నాం” అని మేకర్స్ వెల్లడించారు. అయితే టైం బాంబ్ పై కనిపిస్తున్న సమయాన్ని బట్టి చూస్తే 12 ఫిబ్రవరి 2021 న ఈ వెబ్ సిరీస్ విడుదల అవుతుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ టీమ్ త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఫస్ట్ సీజన్ లో నటించిన మనోజ్ బాయ్ పాయ్ – ప్రియమణి – శ్రేయా ధన్వంతరి – శరద్ కేల్కర్ – షరీబ్ హష్మీ లు ఇందులో కూడా కొనసాగుతున్నారు.