Templates by BIGtheme NET
Home >> Cinema News >> హీరోల్లో శర్వానంద్ వేరయ్యా

హీరోల్లో శర్వానంద్ వేరయ్యా


యంగ్ హీరోలు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలకు వరుసగా రెండు మూడు ఫ్లాప్ లు పడితే వారు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కొందరు హీరోలు కెరీర్ ఆరంభంలో మంచి సక్సెస్ లు దక్కించుకున్నా ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు లేకపోవడంతో పాటు వరుస ఫ్లాప్ లు రావడంతో రెండు మూడు సంవత్సరాలకే కనిపించకుండా పోయారు. కాని హీరోల్లో శర్వానంద్ వేరు అన్నట్లుగా ఈ యంగ్ హీరో వరుసగా ప్లాప్ లు చవి చూస్తున్నా కూడా ఆఫర్ల విషయంలో మాత్రం ఎప్పుడు వెదుక్కునే పరిస్థితి రాలేదు.

కెరీర్ ఆరంభంలో మినిమం గ్యారెంటీ హీరోగా ఈయనకు పేరు వచ్చింది. కాని గత రెండేళ్లుగా ఈయన వరుసగా నిరాశ పర్చతు వచ్చాడు. ఈ ఏడాది విడుదల అయిన జాను సినిమా కూడా శర్వాకు కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేక పోయింది. అయినా కూడా ఈయన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆ నాలుగు కూడా వచ్చ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకారం సినిమాతో పాటు మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.

మహా సముద్రం మరియు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా లు సెట్స్ పై ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కూడా చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ యంగ్ హీరో వరుసగా సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపర్చుతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లేని శర్వా ఫ్లాప్ లు వచ్చినా ఆఫర్లు మాత్రం దక్కించుకోవడం వల్ల హీరోల్లో శర్వా వేరు అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.