సోషల్ మీడియాపై క్లాస్ తీస్కున్న మహేష్ హీరోయిన్

0

లైట్ గా క్లాస్ తీస్కున్నట్టు కనిపిస్తున్నా కానీ గట్టిగానే కోటింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ. నేటితరానికి ఓ రేంజులోనే క్లాస్ తీస్కుంది. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే.. మహేష్ సరసన అతిథి సినిమాలో నటించింది అమృతారావు. ఈ బాలీవుడ్ క్యూట్ గాళ్ కి తెలుగు బెల్ట్ లోనూ అభిమానులేర్పడ్డారు. కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేదు. అయితే అతిథి సమయంలో ఇక్కడ సరిగా పీఆర్ ని మేనేజ్ చేయలేక విఫలమైందా? అంటే తనకు తెలిసొచ్చేసరికే ఫేమ్ పోయిందనే చెప్పాలి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతిథి పీఆర్ మేనేజ్ మెంట్ సోషల్ మీడియా ప్రభావం గురించి క్లాస్ తీస్కుంది. ఇప్పుడు నటన ప్రతిభ కంటే ప్రచారమే ముఖ్యం. దానిని సవ్యంగా చేసుకుంటే పెద్ద స్టార్ అయ్యే ఛాన్సుంటుందని అంగీకరించింది. అమృత రావు మాట్లాడుతూ 2002 లో తాను బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమయంతో పోల్చితే నేటితరానికి విజిబిలిటీ ప్రచారం చాలా అవసరమైంది. సోషల్ మీడియా అనేది టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థల అవసరాన్ని కూడా మార్చివేసిందని నేటి అడ్వాన్స్ మెంట్ పై చెప్పుకొచ్చింది. ఒక రకంగా సోషల్ మీడియా ఉంటే మేనేజర్లకు పని తగ్గిందన్న భావనను వ్యక్తం చేసింది.

నేటి తరంతో పోలిస్తే పీఆర్ లు మెషినరీ యుగానికి ముందు ఎవరైనా నటి లేదా నటుడికి ప్రజాదరణ హోదా అనేవి ప్రతిభకు సింబాలిక్ గా ఉండేవి. నన్ను అలానే గుర్తించారు అప్పట్లో. ఇష్క్ విష్క్-మస్తీ-మెయిన్ హూ నా సినిమాల్లో నా నటనే ప్రజల్లో గుర్తింపు తెచ్చింది. మెయిన్ హూన్ నాలో షారూఖ్ ఖాన్ -సుశ్మితా సేన్ లాంటి దిగ్గజాలు నటించినా నన్ను గుర్తించారంటే నట ప్రతిభ వల్లనే అని చెప్పుకొచ్చింది. ఈరోజుల్లో నటన కంటే సోషల్ మీడియా వల్లనే గుర్తుంటున్నారని షాకిచ్చింది.

సోషల్ మీడియాలో జనాదరణ పొందిన సెలబ్రిటీగా మారడంలో తప్పు లేదు కానీ కళాకారులుగా నైపుణ్యాలను పదునుపెట్టుకోవడం చాలా అవసరం అని నేననుకుంటాను అని అంది. ఇప్పుడు టాలెంట్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు! ఒక విధంగా ఇది మంచి సాంస్కృతిక మార్పు ఇది కళాకారులకు ఉద్యోగ అవకాశంతో పాటు భద్రతను కలిగిస్తుంది అని అమృత వివరించారు. తనను మాత్రం ఇప్పటికీ కాలేజ్ పిల్లలు ఫలానా చిత్రంలో నటి అంటూనే గుర్తుంచుకుంటున్నారట.