యువహీరోతో లవ్వాయణంపై ఓపెనైన మ్యారీడ్ బ్యూటీ

0

యంగ్ హీరో తరుణ్ కెరీర్ తొలినాళ్లలో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో తరుణ్ అమ్మాయిలకు హాట్ ఫేవరేట్. గాళ్స్ లో తరుణ్ భారీ క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ఆ టైమ్ లో తరుణ్ పై చాలా గాసిప్పులు వినిపించాయి. హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ తో తరుణ్ ప్రేమాయణం నడిపించాడని.. ఆ తర్వాత లవ్ బ్రేకప్ అయ్యిందని ఓ రేంజ్లో ప్రచారం జరిగింది.

ఆ తరువాత హీరోయిన్ ప్రియమణితో కూడా తరుణ్ లవ్ స్టోరీ నడిపించాడని.. ఈ జంట ప్రేమకథ పెళ్లి దాకా వెళ్లిందని ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా వీరి ప్రేమ కథ వెనకున్నఅసలు సీక్రెట్ ఏంటన్నది తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. `నవవసంతం` చిత్రంలో తరుణ్- ప్రియమణి కలిసి నటించారు. ఆ సమయంలోనే ఈ జంట నిజంగానే ప్రేమలో వున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై ప్రియమణి తాజా వివరణ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తరుణ్ తో తాను ప్రేమలో వున్నానని వాళ్ల ఫ్యామిలీ మా ప్రేమని అంగీకరించిందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రచారం జరుగుతున్నట్టు చెన్నైకి చెందిన ఓ జర్నలిస్ట్ ఫోన్ చేసి చెప్పారు. ఈ ప్రచారంపై మీరు స్పందిస్తే బాగుంటుందని చెప్పడంతో తనపై రూమర్స్ రాసిన జర్నలిస్టుపై అరిచేశానని ప్రియమణి తెలిపారు. తనకు తరుణ్ కార్ గిఫ్ట్ గా కూడా ఇచ్చినట్టు రాశారని అందులో ఎలాంటి నిజం లేదని ప్రియమణి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేసారు. ప్రియమణి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.