పాయల్ మరో ఆర్ఎక్స్ 100

0

తెలుగు ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. మొదటి సినిమాలోనే నటిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత బిజీ బిజీ అయ్యింది. మొదటి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన పాయల్ మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా పాత్రలో కనిపించబోతుంది. ‘అనగనగా ఓ అతిథి’ సినిమాతో పాయల్ రాజ్ పూత్ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాయల్ రాజ్ పూత్ మరియు చైతన్య కృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించాడు.

ఇటీవల కాలంలో ఆహా వరుసగా చిన్న సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సినిమాను ఈనెల 20వ తారీకున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. అనగనగా ఓ అతిథి ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. సినిమాలో పాయల్ రాజ్ పూత్ పాత్ర చాలా విభిన్నంగా ఉంది.

ఆమె గెటప్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆమెకు మరోసారి నటిగా మంచి మార్కులు తెచ్చుకుంటుందనిపిస్తుంది. బాడీలాంగ్వేజ్ తో పాటు ఆమె వాయిస్ చాలా మాస్ గా ఉంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా రూపొందింది. కథ ఈ సినిమా బలం అంటూ మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఆహా ద్వారా విడుదలైన సినిమాలకు మంచి టాక్ వచ్చింది. కనుక ఈ సినిమా మరో మంచి సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.