శ్రీదేవి వారసురాలు జాన్వీ కంటే స్పీడ్ గా ఉందే!

0

నటవారసురాలు అనన్య పాండేపై ఒక సెక్షన్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయినా అదేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది స్టార్ కిడ్ అనన్య పాండే. ఈ అమ్మడు కెరీర్ పరంగా ఏమాత్రం డిస్ట్రబ్ అయ్యేందుకు సిద్దంగా లేదని తన ప్లానింగ్స్ చెబుతున్నాయి.

కరణ్ జోహార్ ఇంట్రడ్యూస్ చేసిన నటవారసురాలిగా తనపై విమర్శలు ఎక్కుపెట్టేవాళ్లు ఉన్నా.. తన సినిమాల ట్రైలర్లు బాలేదంటూ ట్రోల్ చేసినా అవేవీ పట్టించుకోకుండా పాజిటివ్ ధృక్పథంతో ముందుకు సాగుతోంది. తాజాగా అనన్య పాండే ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ ఫోటోని షేర్ చేసింది. బీచ్లో సముద్ర తీరాన నిలుచుని కెమెరాకి ఫోజిచ్చింది. చాలా సాధారణం తెలుపు నేవీ బ్లూ స్వేట్ షర్ట్ లో అద్భుతంగా కనిపిస్తోంది. “సాధారణ వైఖరి.. కృతజ్ఞత“ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది.

అనన్య నటించిన ఖాలీ పీలీ కి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. అనన్య నటిగా ఇంప్రూవ్ అయ్యిందన్న ప్రశంసలు దక్కాయి. ఇక ఇదే చిత్రంలో ధడక్ ఫేం ఇషాన్ ఖత్తర్ కథానాయకుడిగా నటించాడు. జాన్వీ తర్వాత మరో స్టార్ కిడ్ అనన్యతో రొమాన్స్ చేసిన యంగ్ బోయ్ గా రికార్డులకు ఎక్కాడు. ప్రస్తుతం షకున్ బాత్రా నిర్ధేశనంలో ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం షూటింగ్ కోసం అనన్య గోవాలో ఉంది.

ఈ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటూనే మధ్యలో విజయ్ దేవరకొండ సరసన పాన్-ఇండియన్ చిత్రం ఫైటర్ కి కాల్షీట్లు కేటాయిస్తోందట. రౌడీ బోయ్ లాంటి క్రేజీ హీరోతో టాలీవుడ్ లోకి ఘనమైన ఎంట్రీనే ఇస్తోంది. జాన్వీకి దక్కాల్సిన ఆఫర్ చివరి నిమిషంలో అనన్య ఎగరేసుకు వెళ్లిన సంగతి తెలిసినదే.