మేకప్ లేకున్నా రౌడీ బ్యూటీ క్యూటీనే

0

కొంత మంది హీరోయిన్స్ మేకప్ లేకుండా బయట కనిపించరు. ఎందుకంటే వారి మొహంను మేకప్ లేకుండా చూడటం కష్టం. కొందరు అయితే మేకప్ లేకుంటే గుర్తు పట్టడమే కష్టంగా ఉంటుంది. దాంతో ఎప్పుడు కనిపించినా కూడా మేకప్ లేకుండా మాత్రం కనిపించరు. కొందరు మాత్రం మేకప్ ఉన్నా లేకున్నా అందంగా కనిపిస్తూ ఉంటారు. అందులో బాలీవుడ్ ముద్దుగ్ము అనన్య పాండే ఒకరు. ఈ అమ్మడు ఇటీవల షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొహానికి మేకప్ .. లిఫ్ స్టిక్ ఇలా ఏ ఒక్క బ్యూటీ హంగులు లేకుండా అనన్య పాండే కనిపించింది.

సింపుల్ హెయిర్ స్టైల్ తో ఒక టీషర్ట్ లో మెడలో చిన్న చైన్ తో సూపర్ స్కిన్ టోన్ తో అనన్య షేర్ చేసిన ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ నాచురల్ బ్యూటీ అందంతో పాటు అభినయంతో కూడా మెప్పిస్తూ వచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఈ అమ్మడి ఫొటో షూట్ ను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేయడంతో పాటు విజయ్ దేవరకొండకు జోడీగా పూరి దర్శకత్వంలో ఈమె లైగర్ సినిమాను చేస్తోంది. రౌడీ స్టార్ తో ఈ అమ్మడు సౌత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. లైగర్ విడుదలకు ముందే ఒకటి రెండు సౌత్ ఆఫర్లు ఆమె తలుపు తట్టినట్లుగా సమాచారం అందుతోంది.