అలా నవ్వి అనసూయ బౌన్సర్!

0

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. నవతరం యంకర్లలో అనసూయకు ఉన్నంత ఫాలోయింగ్ వేరొక యాంకర్ కి లేనే లేదు. ఎందరో యాంకర్లు ఉన్నా బుల్లితెరకు గ్లామర్ పరంగా హైడోస్ అద్దిన బ్యూటీగా అనసూయను యువతరం ఆరాధిస్తుంది.

కేవలం గ్లామర్ ఎలిమెంటే కాదు.. ప్రతిభకు ప్రతిభ.. ధృఢమైన వ్యక్తిత్వం తనకు ప్రధాన ఆకర్షణ. బుల్లితెర యాంకర్ గా నటిగా కెరీర్ పరంగా పెద్ద స్థాయి అందుకున్న తెలుగమ్మాయిగా తనకంటూ ఓ స్థాయి ఉందిప్పుడు. ఇటీవల రంగస్థలం రంగమ్మత్తగా పాపులరయ్యాక వెండితెర అవకాశాల పరంగానూ వెనుదిరిగి చూసిందే లేదు. సినిమాల్లో నటించడం అవార్డులు గెలుచుకోవడం ద్వారా తన ఉనికిని పెద్ద స్థాయిలో ఎలివేట్ చేసుకుంది.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఇటీవల సోషల్ మీడియా క్వీన్ గానూ అనసూయ చెలరేగుతోంది. రెగ్యులర్ ఫోటోషూట్లతో ఈ అమ్మడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఫ్యాషనిస్టాగా తన రేంజే వేరుగా ఉంది. ఆక్వా బ్లూ షేడ్ గౌను పర్పుల్ కలర్ టాప్ తో బాపు బొమ్మనే తలపిస్తోంది. అందమైన చిరునవ్వుతో కుర్రాళ్లకు బౌన్సర్ వేసింది మరి అంటూ వేడిగా కామెంట్లు వినిపిస్తున్నాయి.