మహాబలేశ్వరం కొండ కోనల్లో RRR షూటింగ్

0

పచ్చని కొండ కోనలు అడవులతో ఆధ్యాత్మిక స్థలంగానూ మహాబలేశ్వరం ఎంతో ప్రసిద్ధి. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో ఈ పవిత్ర స్థలం ఉంది. అలాంటి చోట షూటింగ్ అంటే చిత్రబృందానికి అంతకంటే థ్రిల్లింగ్ మ్యాటర్ ఇంకేం ఉంటుంది. అయితే చలికాలం ప్రవేశించాక హిల్ స్టేషన్ కి వెళ్లడమే ఇక్కడ ఆసక్తికర పాయింట్.

ఇంతకీ ఎవరు వెళ్లారు? అంటే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా రామ్ చరణ్ – తారక్ సహా నాయికల బృందం మహాబలేశ్వరానికి బయల్దేరిందట. ఇటీవలే ఈ పాన్ ఇండియా మూవీ సుదీర్ఘ నైట్ షెడ్యూల్ ని ముగించి యూనిట్ చిన్న విరామం తీసుకుంది. తాజా షెడ్యూల్ మహాబలేశ్వర్ లో ప్రారంభమైంది. అక్కడ కొన్ని అందమైన ప్రదేశాలలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్- రామ్ చరణ్ ఇద్దరూ పాల్గొంటున్నారు.

చరణ్- ఎన్టీఆర్ గత వారం చెన్నై వెళ్లి షెడ్యూల్ కోసం సిద్ధమయ్యారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా బృందం మహాబలేశ్వర్ నుండి ఆన్ లొకేషన్ వీడియోను పోస్ట్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ తదుపరి షెడ్యూల్ త్వరలో పూణేలో ప్రారంభం కానుంది. అలియా భట్ ఈ షెడ్యూల్ లో సెట్స్ పైకి చేరనున్నారు. చరణ్ – ఆలియాపైనా కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం.