సూపర్ స్టార్ తో పవర్ స్టార్..?

0

టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఒకే పంథాలో ముందుకు సాగుతూ వస్తున్నారు. మొదట్లో ఇద్దరు కూడా సినిమా ఫంక్షన్లకి దూరంగా ఉంటూ.. వారి పనులు వాళ్ళు చూసుకుంటూ రిజర్వుడ్ గా ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో ఇద్దరూ తమ పంధా మార్చుకున్నారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి కానీ పవన్ – మహేష్ మాత్రం ఒకరిపట్ల ఒకరు ఆప్యాయత చూపిస్తూ ఉంటారు. గతంలో మహేష్ నటించిన ‘అర్జున్’ సినిమా పైరసీకి సంభందించి పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి సపోర్ట్ గా నిలిచాడు. అలానే తర్వాత పవన్ నటించిన ‘జల్సా’ కి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి అనుబంధాన్ని చాటుకున్నాడు. ఈ క్రమంలో వీరి కలయికలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ప్రతీ సినీ అభిమాని కోరుకుంటాడు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలు ఊపందుకున్నాయి. చిన్న హీరోలే కాకుండా స్టార్ హీరోలు సైతం కలిసి నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ మధ్య రూపొందించిన మల్టీస్టారర్స్ లో చాలా వరకు సూపర్ హిట్ అయినవే. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ – పవన్ క్రేజీ కాంబినేషన్ సెట్ అవబోతోందని న్యూస్ వస్తోంది. మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ లో పవన్ కళ్యాణ్ కూడా కనిపించనున్నాడట. బ్యాంక్ స్కాముల నేపథ్యంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతోన్న వారిని టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన పాత్రలో పవన్ కల్యాణ్ నటించబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. నిడివి తక్కువ అయినప్పటికీ కథలో కీలకమైన రోల్ లో పవన్ అయితేనే బాగుంటుందని డైరెక్టర్ పరాశురామ్ భావిస్తున్నాడట. ఇందులో నిజమెంతనేది తెలియనప్పటికీ ఈ రూమర్ నిజమైతే మాత్రం అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.