Templates by BIGtheme NET
Home >> Cinema News >> సిల్క్ స్మిత బయోపిక్ పుకార్ అనేసిన అనసూయ

సిల్క్ స్మిత బయోపిక్ పుకార్ అనేసిన అనసూయ


తెలుగమ్మాయి అయిన.. ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవితంపై బాలీవుడ్ లో డర్టీపిక్చర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిల్క్ జీవితంపై వేరొక సినిమా ఏదీ లేదు. కానీ సిల్క్ స్మిత పాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయ నటిస్తున్నారని తామరతంపరగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమేనని ఖండిస్తూ అనసూయ మీడియాపై మండి పడ్డారు.

సిల్క్ స్మిత బయోపిక్ లో తాను నటించడం లేదని తోసి పుచ్చారు. “నేను ఏ బయోపిక్ లోనూ సిల్క్ స్మిత పాత్రను పోషించడం లేదు“ అని ఆమె సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో అన్ని సందేహాలను తొలగించినట్టు అయ్యింది.

అయితే ఇంతకుముందు అనసూయ తన తొలి తమిళ చిత్రం లొకేషన్ నుండి ఒక ఫోటోను పంచుకుంది. బ్లాక్ అండ్ వైట్ ఛాయాచిత్రంలో సిల్క్ స్మితను తలపించడంతో అటుపై మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి. కానీ తాజాగా అనసూయ స్వయంగా ఆ వార్తలన్నిటినీ ఖండించడంతో ఓ క్లారిటీ వచ్చేసినట్టయ్యింది.