బాత్రూమ్ ని కుడా వదలట్లేదు : యాంకర్ అనసూయ

0

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ సైతం ఆయన మృతికి సంతాపం తెలియజేసారు. అయితే జయప్రకాశ్ రెడ్డి బాత్రూమ్ లో కుప్పకూలి మరణించిన ఫోటోలు వీడియోలను యూట్యూబ్ ఛానెల్స్.. పలు మీడియా ఛానళ్లు ప్రసారం చేసిన తీరుపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై యాంకర్ అనసూయ భరద్వాజ్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త వినగానే అనసూయ సోషల్ మీడియాలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. టీవీ ఛానెల్ లో పనిచేసే సమయంలో జయప్రకాశ్ రెడ్డి మాట్లాడే ఆకర్షణీయమైన యాసను అనుకరించే ప్రయత్నం చేసేదానిని. మీరు ఎప్పటికీ మా హృదయంలో ఉంటారు అని అనసూయ భరద్వాజ్ పేర్కొన్నారు. అయితే జయప్రకాశ్ రెడ్డి మరణానికి సంబంధించిన ఫోటోలు ప్రసారం చేయడంపై స్పందిస్తూ.. ”నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు.. బాత్రూమ్ ని కుడా వదలట్లేదు.. ఈ రోజుల్లో మరణం విషయంలో కూడా డిగ్నిటీ అనేది లేకుండా పోయింది” అని పేర్కొంది.