నాని సినిమాయే రిలీజ్ చేస్తుంటే.. యాంకర్ సినిమా రిలీజ్ చేయలేరా…?

0

కరోనా నేపథ్యంలో థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమా రిలీజులు ఆగిపోయాయి. కాకపోతే నష్టాల బారి నుండి బయటపడటానికి మరో ఆప్షన్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మారాయి. ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారో లేదో అనే ఉద్దేశ్యంతో మేకర్స్ అందరూ తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు హీరో రేంజ్.. సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఓటీటీ వేదికపై దర్శనమిచ్చాయి. అయితే టాలీవుడ్ లో ఇప్పటివరకు చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే డిజిటల్ రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ సినిమాతో రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ మూవీస్ ఓటీటీలో విడుదలకు వచ్చే అవకాశం ఉంది. నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన ‘వి’ సినిమాని సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కూడా తన సినిమాని ఓటీటీలో విడుదల చేస్తుండటంతో ఇప్పుడు మిగతా మేకర్స్ డిజిటల్ రిలీజ్ గురించి ఆలోచిస్తున్నారట. అయితే యాంకర్ ప్రదీప్ సినిమా మేకర్స్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు లేదని ఫిలిం సర్కిల్స్ చర్చించుకుంటున్నారు.

కాగా తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. సుకుమార్ దగ్గర కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ వీ బాబు నిర్మిస్తున్నారు. ప్రదీప్ కి ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రెండు పెద్ద బ్యానర్లు గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రీబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ కి బ్రేక్ పడింది. ఈ సినిమాకి ఆ మధ్య వదిలన సిద్ శ్రీరామ్ పాడిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ తో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ పాట తీసుకొచ్చిన క్రేజ్ కరోనా క్రైసిస్ తుడిచిపెట్టేసింది. అయితే రాబోయే రోజుల్లో థియేటర్ రిలీజ్ చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా కోసం ఆడియన్స్ థియేటర్ కి వస్తారో లేదో అనేదీ అనుమానమేని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. నాని సినిమానే ఓటీటీలో రిలీజ్ చేస్తుంటే యాంకర్ ప్రదీప్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయలేరా అని.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ని ఓటీటీ బాట పట్టించడం ఎలానో ప్రదీప్ వెతకాలని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ కంటెంట్ కూడా ఓల్డ్ అయిపోయితుందని.. మేకర్స్ త్వరగా ఏదొక నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.